మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి పలు సినిమాల్లో తనదైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత నిర్మాతగా మారింది. ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లు చేస్తూ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 'అగ్ని నక్షత్రం' అనే సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈమధ్య గ్లామర్ డోస్ ని మరింతగా పెంచుతూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. రీసెంట్ గా అయితే బికినీలో దర్శనమిచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది.
ఈ వయసులోనూ స్టార్ హీరోయిన్స్ కి తగ్గకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న మంచు లక్ష్మి తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో బికినీ వేసి మంచు గడ్డలో స్నానం చేసి మరోసారి ఫ్యాన్స్ తో పాటు నిటిజన్స్ ని ఆశ్చర్యపరిచింది. గతంలో టాలీవుడ్ హీరోయిన్స్ అయిన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ ఫిన్ ల్యాండ్ దేశంలోని ఓ లొకేషన్ లో మంచలో ఉన్న కొలనులో బికినీ వేసుకుని దిగి స్నానం చేసి వచ్చారు. ఆ వీడియోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఆ ఇద్దరు హీరోయిన్లు గడ్డ కట్టిన మంచులో బికినీ వేసుకొని మరీ ఐస్ బాతింగ్ చేయడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
తాజాగా మంచు లక్ష్మి కూడా అదే చేసింది. రకుల్, ప్రగ్యా జైస్వాల్ ఐస్ బాతింగ్ చేసిన సేమ్ లొకేషన్ ఫిన్ ల్యాండ్ లోనే మంచు లక్ష్మి కూడా బికినీలో వెళ్లి గడ్డ కట్టిన మంచు మధ్యలో స్నానం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఏజ్ లోను మంచి లక్ష్మి ఇలాంటి సాహసాలు చేయడంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ మంచు లక్ష్మిని తెగ మెచ్చుకుంటున్నారు. మంచు లక్ష్మి బికినీలో అది కూడా గడ్డకట్టిన మంచులో ఐస్ బాతింగ్ చేయడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.