యూట్యూబ్లో మెసేజ్ ఓరియెంటెడ్, కామెడీ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందు సాయి పక్కింటి కుర్రాడు అనే ట్యాగ్ తో యూట్యూబ్ లో పాపులర్ అయ్యాడు. యూట్యూబ్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న చందు సాయి యువతిపై అత్యాచార ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కాడు. హైదరాబాద్ నగర శివారు నార్సింగి కి చెందిన ఓ యువతీ నమోదు చేసిన ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసి చందు సాయిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో తనను చందు సాయి మోసం చేశాడని,
తనపై అత్యాచారం కూడా చేయబోయేడని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనను పట్టించుకోకుండా ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి చివరికి పోలీసులను ఆశ్రయించింది. దీంతో చందు సాయిపై రేప్ సీటింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని చందు సాయి స్వయంగా చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. ప్రేమ పేరుతోనే గతంలో తన పుట్టినరోజు అని చెప్పి ఇంటికి పిలిచి 2021 ఏప్రిల్ 25 తేదీన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు
ఆ యువతి వెల్లడించింది. కాగా యూట్యూబ్ లో చందు గాడు, పక్కింటి కుర్రాడు లాంటి యూట్యూబ్ ఛానెల్స్ లో మెసేజ్ ఓరియంటెడ్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసిన చందు సాయి ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని షార్ట్ ఫిలిమ్స్ కి యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చేవి. ఆ సమయంలో అతనిపై కొన్ని పుకార్లు కూడా షికార్లు చేశాయి. యూట్యూబర్ చందు సాయి యూట్యూబ్ ద్వారా రెండు కోట్లు సంపాదిస్తున్నాడని.. పెద్ద బంగ్లా, ఖరీదైన కారు కూడా అతనికి ఉందనే ప్రచారం కూడా జరిగింది.