2021లో విడుదలై చిత్ర పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించింది పుష్ప సినిమా. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలో పాటలు ఫైట్స్ డైలాగులు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేశాయి అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా విజయంతో అటు అల్లు అర్జున్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్కి ఉత్తమ జాతియ నటుడు అవార్డు సైతం దక్కింది. దాంతో ఇప్పుడు కోసం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.
ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని నానా విధాలుగా ట్రై చేస్తున్నారు. అయితే పార్ట్ వన్ కి వచ్చినంత రెస్పాన్స్ కి డబుల్ రావాలి అని ఏ సినిమా అని ఎక్కువ భాషలో విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోని సినిమాకి సంబంధించిన షూటింగ్ సైతం జరుపుతున్నారు. అయితే సినిమా యూనిట్ సభ్యులకు దెబ్బ మీద దెబ్బ ఎదురవుతుంది.. అసలు విషయం ఏంటంటే పుష్ప సినిమాలో కేశవ పాత్ర ఎంత కీలకంగా మారిపోయిందో మనందరికీ తెలిసిందే.
సినిమాలో సగం అల్లు అర్జున్ ఉంటే సగం కేశవ నే కనిపిస్తాడు. రెండవ భాగంలో కూడా కేశవ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఒక అమ్మాయిని వేధించడంతోపాటు ఆమె ప్రైవేట్ ఫోటోలని పోస్ట్ చేస్తాను అని బెదిరించడంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో కేశవను అరెస్టు చేశారు. సెకండ్ భాగంలో కేశవ పాత్రకి సంబంధించి ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈ షాక్ లో ఉండగా మరో షాక్ తగిలింది. ఇప్పుడు బాలీవుడ్ లో “పుష్ప” అల్లు అర్జున్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురికావడం జరిగింది. అలా పుష్ప సినిమాకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది..!!