
త్రిష @ 21 ఏళ్లు.. ఆ ఘనత త్రిష కే సాధ్యమా..?
సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో నటించిన త్రిష ఇప్పటికీ 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. సోలో హీరోయిన్గా మొదట ఎంట్రీ ఇచ్చిన ఈ మద్రాసు బ్యూటీ దాదాపుగా రెండు దశాబ్దాల సినీ కెరియర్లో తెలుగు తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సౌత్ లో ఉన్న స్టార్ హీరోల అందరితో కూడా నటించిన త్రిష కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మరొకసారి రీ యంట్రీ ఇవ్వడం జరిగింది.. ఇందులో నటించిన ఐశ్వర్యరాయ్ ని డామినేట్ చేసి మరి తన అందంతో త్రిష ఆకట్టుకోవడం జరిగింది.
ఈ సినిమాలో త్రిషని చూసిన వారందరూ కూడా ఆమె అందానికి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా త్రిష తో పాటు కెరియర్ ప్రారంభించిన చాలామంది హీరోయిన్స్ ఫేడౌట్ కావడం జరిగింది. కానీ త్రిష మాత్రం ఇంకా యంగ్ హీరోల సరసన నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంటుంది. ఇటీవలే లియో సినిమాలో కూడా నటించి పర్వాలేదు అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అజిత్ తో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. చిరంజీవితో కూడా ఒక న్యూస్ నటించబోతున్నట్లు సమాచారం.. త్రిష ఇండస్ట్రీ లోకి వచ్చి 21 ఏళ్లు అవడం గొప్పకాదు కాని 21 ఏళ్లపాటు యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలబడడం కేవలం త్రిష కే సాధ్యమైంది అంటూ తెలుపుతున్నారు.