మళ్ళీ వార్తలలో సిల్క్ స్మిత !
దశాబ్దాలు గడుస్తున్నా ఒకప్పటి సంచలన నటి ఐటమ్ సాంగ్స్ కు చిరునామాగా ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత పేరు ఇంకా చాలమందికి గుర్తు వస్తూనే ఉంటుంది. ఆరోజులలో తెలుగు తమిళ ప్రేక్షకులు కేవలం ఆమె ఐటమ్ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అప్పట్లో దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ఒక టాప్ హీరోతో తీస్తున్న సినిమాకు సంబంధించి సిల్క్ స్మిత మీద తీయవలసిన పాటను అనవసరం అనుకుంటే ఆవిషయం తెలుసుకుని ఆసినిమా డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా ఆసినిమాని కొనమని చెప్పడంతో మరో మార్గం లేక దాసరి ఆరోజులలో సిల్క్ స్మిత తో ఒక ఐటమ్ సాంగ్ చేయవలసి వచ్చింది అని చెపుతు ఉంటారు. అలా ఇండస్ట్రిని శాసించిన సిల్క్ స్మిత జీవితం పూల బాట కాదు. చాలా వివాదాలు ఆమె జీవితంలో అనేకం ఉన్నాయి.
ఆరోజులలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆనాటి పత్రికలు వార్తలు వ్రాస్తూ ఉండేవి ఆమె జీవితం ఆధారంగా విద్యాబాలన్ టైటిల్ పాత్రలో 2011లో మిలన్ లుత్రియా దర్శకత్వంలో ‘ది డర్టీ పిక్చర్’ వచ్చింది. ఆరోజులలో ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు మళ్ళీ సిల్క్ స్మిత జీవితం పై మరో సినిమా రాబోతోంది. చంద్రికారవి సిల్క్ స్మితగా నటిస్తున్న ఈ మూవీని జయరామ్ దర్శకత్వంలో రాబోతోంది.
ఈ మూవీ టైటిల్ ఫిక్స్ అవ్వనప్పటికీ అన్ టోల్డ్ స్టోరీ అని ట్యాగ్ లైన్ పెట్టి ప్రపంచానికి తెలియని కథను చూపిస్తామని మేకర్స్ చెపుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన చంద్రికరవి ఆమధ్య ‘వీరసింహారెడ్డి’ లో మనోభావాల్ దెబ్బతిన్నాయే అనే ఐటమ్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. సిల్క్ స్మిత జీవితం విషాదంగా అనుమానాస్పద రీతిలో చనిపోయిన విషయం ఆరోజులలో ఒక సంచలనం ఇప్పుడు మళ్ళీ ఆనాటి సంచలనాలను ఈనాటి తరం వారికి గుర్తుకు చేస్తూ తీయబోతున్న ఈ బయోపిక్ పై సిల్క్ స్మిత బంధువులు ఎలా స్పందిస్తారో చూడాలి..