హాయ్ నాన్న కు సహకరించిన నితిన్ !
ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడానికి ఒక విధంగా పరోక్షంగా నితిన్ కూడ సహకరించినట్లు అనిపిస్తోంది. నీతిన వక్కంతం వంశీల కాంబినేషన్ లో గతవారం విడుదలైన ‘ఎక్స్ ఆర్డినరీ మ్యాన్’ మూవీని చూసిన సగటుప్రేక్షకుడు ఆ సినిమాకు ఆర్డినరీ మ్యాన్’ అంటూ కామెంట్స్ పెడుతూ ఉండటంతో గతవారం విజేతగా నాని సినిమా మారిపోయింది.
‘భీష్మ’ మూవీ తరువాత నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకుని ‘ఎక్స్ ఆర్డినరీ మ్యాన్’ లో నటించాడు. అయితే ఆ సినిమా ఏమాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. కనీసం శ్రీలీల మ్యానియా కూడ ఏమాత్రం సహకరించలేదు. దీనితో నితిన్ కెరియర్ లో మరొక ఫ్లాప్ వచ్చి చేరింది. గత వారాంతంలో సినిమాలు చూడాలి అని అనుకునే వారికి నాని ‘హాయ్ నాన్న’ తప్పించి మరోక ఎటువంటి ఆఫక్షన్ లేకుండా పోయింది.
దీనితో నాని అదృష్టం కలిసివచ్చి ‘హాయ్ నాన్న’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఆసినిమా హిట్ జాబితాలో చెరిపోయింది. దీనీకితోడు ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు నాని నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సీత రామం’ తరువాత మృణాల్ ఠాగూర్ నటించిన ఈ మూవీ కూడ హిట్ అవ్వడంతో ఆమె మార్కెట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత పెరిగి ఆమె పారితోషికం మరింత పెరిగే ఆస్కారం ఉంది..