అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ కి చేరుకుంది. ఈ సీజన్ మొదటి నుండి అలరిస్తూ టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. సీరియల్ బ్యాచ్ రైతుబిడ్డ సినీ స్టార్స్ ఇలా అందరూ తమ తమ టాలెంట్ ను చూపించి హౌస్ లో అందరూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే బిగ్ బాస్ సైతం గత సీజన్ తప్పులు జరగకుండా మొదటి నుండి చాలా చక్కని ప్లాన్లను ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు. టెన్షన్ పెట్టే నామినేషన్స్ రసవత్తరంగా ఉండే గేమ్స్ మధ్య మధ్యలో సీరియల్ భామల అందాల ఆరబోత ఇలా చెప్పుకుంటూ పోతే
గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్ చాలా వరకు ఎంటర్టైన్ చేసింది అని చెప్పాలి. మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వచ్చారు. ఫైనల్ వీక్ కు ఆరుగురిని హౌస్ లో ఉంచారు. మరో మూడు రోజుల్లో ఈ సీజన్ ముగుస్తుంది. కాగా ఈ సీజన్ విజేత ఎవరు అన్నది ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు నమోదైన ఓట్లను చూసుకుంటే టాప్ వన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా సమాచారం వినపడుతోంది. అలానే రెండో స్థానంలో శివాజీ ఉండగా నాలుగు స్థానంలో ఉన్న అమర్దీప్ మూడవ స్థానంలోకి చేరుకున్నాడు. ఏవీ ఎఫెక్ట్ తో యావర్ ను వెనక్కి నెట్టి మరీ మూడో స్థానానికి వచ్చేశాడు.
ఇక నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉండగా… అంబటి అర్జున్ ఐదో స్థానంలో, ప్రియాంక జైన్ ఆరో స్థానంలో ఉన్నారు. మరి ఈ రెండు రోజుల్లో ఏంజరుగుతుంది చూడాలి. ఇక ఫైనల్ ఈవెంట్ గా గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ రాబోతున్నట్లు వినికిడి. మహేష్ బాబు ఈ ఫినాలే కార్యక్రమంలో పాల్గొని విజేతను ప్రకటించి ట్రోఫీ అందజేయబోతున్నారని అంటున్నారు. పనిలో పనిగా తన గుంటూరు కారం సినిమా ప్రమోషన్లను కూడా నిర్వహించినట్లు ఉంటుందన్న ఉద్దేశంతోనే మహేష్ బాబు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫినాలే కు గెస్ట్ గా వస్తున్నారా లేదా అన్నది తెలియాలంటే మరొక మూడో రోజులు వెయిట్ చేయాల్సిందే..!!