ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ నుండి ఫస్ట్ సింగిల్ రెడీ..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా కోసం ఫాన్స్ ఎంతో ఎగ్జైటింగా ఎదురుచూస్తున్నారు. కేజిఎఫ్ సినిమాతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ సినిమా పై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ ట్రైలర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రోజురోజుకీ ఈ సినిమా చూడడం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పలుసార్లు వాయిదా పడుతు వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.


 ఈ క్రమంలో రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ పనుల్లో కూడా వేగం పెంచేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే సలార్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా ఇచ్చేసారు మేకర్స్. సూరీడే అంటూ సాగే ఈ పాట ఈరోజు డిసెంబర్ 13న విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు. ఏ టైం కి పాట విడుదల చేయబోతున్నారు అన్న విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు మేకర్స్. ఇక ఈ సినిమాకు కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్న్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్‌ రెండు పార్ట్స్ కు కూడా ఈయనే సంగీతం అందించారు.


 దీంతో సాలార్ కు కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ అందిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే సాలార్ ఫస్ట్ సాంగ్ పై భారీగా హైప్ క్రియేట్ అవుతోంది. మరి ఆ హైప్ ను ఈ సాంగ్ రీచ్ అవుతుందా అనేది చూడాలి. ఇక సాలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహా, శ్రియారెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక డిసెంబర్ 22న విడుదల కాబోతున్న సలార్ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని ఇప్పటినుండి ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: