ఓరినాయనో.. 10 నిమిషాల సీన్ కోసం 6 కోట్లా?
ఇంతకీ ఇప్పుడు సినిమాల్లో వాడే ఎఫెక్ట్స్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.. ఏకంగా ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమాలో ఇలాంటి ఎఫెక్ట్స్ కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నారు అన్న వార్త వైరల్ గా మారిపోయింది. ఆ హీరో ఎవరో కాదు దళపతి విజయ్. గత కొంతకాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్లకు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల లియో లీవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు.
దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకేక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఇందులో హీరో టీనేజ్ లుక్ లో కనిపించే పది నిమిషాల సీన్ కోసం నిర్మాతలు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. తొలిసారి అత్యాధునిక డి - ఏజింగ్ టెక్నాలజీని ఇక ఈ మూవీలో వాడబోతున్నారట. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతూ ఉండగా.. త్వరలోనే చిత్రబృందం ఇస్తాంబుల్ షూటింగ్ కోసం వెళ్ళపోతున్నారట. అయితే ఇలా ఎఫెక్ట్స్ కోసమే ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నారు అన్న విషయం తెలిసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.