'Mega156' ప్రాజెక్టులో చిరంజీవికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..!?

Anilkumar
'భోళా శంకర్' వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి తన కొత్త సినిమాని యువ దర్శకుడు వశిష్టతో చేస్తున్న విషయం తెలిసిందే. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. రీసెంట్ గానే షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ ని మొదలెట్టారు. షూటింగ్ జరుగుతుండగానే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చిరంజీవి విరామం తీసుకుని హైదరాబాద్ కి వచ్చారు. 

ఓ సరికొత్త ఊహా ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కాగా సినిమాలో చిరంజీవి సరసన పలువురు హీరోయిన్స్ ని మేకర్స్ ఇప్పటికే పరిశీలించారు. వారిలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మెగాస్టార్ సరసన ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ త్రిష పేరు బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ చాన్స్ చెన్నై బ్యూటీ త్రిష కు దక్కినట్లు సమాచారం. ఈ ఏడాది కొన్ని పొన్నియన్ సెల్వన్, లియో వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది త్రిష. తన సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.

అయితే చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని త్రిష ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో త్రిషకి ఆ అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చిరంజీవి స్వయంగా త్రిష పేరును మూవీ టీం కి సజెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. గతంలో చిరంజీవి, త్రిష కాంబినేషన్లో 'స్టాలిన్' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆచార్య సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారని వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. ఇక ఎట్టకేలకు మళ్లీ 17 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ సరసన త్రిష నటించేందుకు రెడీ అయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: