యష్.. టాక్సిక్ సినిమాకి అన్నేళ్లు గ్యాప్..!!
ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన యష్..KGF -2 సినిమా భారీ విజయం అందుకోవడంతో ఆ తర్వాత తదుపరి చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నిన్నటి రోజున ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే టాక్సిక్ అని చెప్పి టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
యష్ దాదాపుగా ఒక సినిమా విడుదలైన తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ ఇచ్చి మరి ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ -2 సినిమా ఏప్రిల్ 14- 2022లో విడుదల కగా టాక్సిక్ అనే చిత్రం ఏప్రిల్ 10 2025 లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా టైటిల్ గ్లింపులో తెలియజేయడం జరిగింది. దీంతో అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని అనుకోగా దాదాపుగా ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే పలువురు అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల విషయాల గురించి ఇంకా తెలియజేయలేదు.