విజయ్ కాంత్ హెల్త్ పై ..ఫోటో రిలీజ్ చేసిన భార్య..!!
అతి త్వరలోనే విజయ్ కాంత్ అందరిని కూడా బయటికి వచ్చి కలుస్తారని తెలియజేయడం జరుగుతోంది .ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోలో రెండు రోజుల క్రితం నేను ఇలాంటి వీడియోను విడుదల చేశాను విజయ్ కాంత్ ఇప్పుడు బాగానే ఉన్నారు. తనపై వస్తున్న వదంతులను వైరల్ చేయకండి అంటూ కోరుతున్నానని తెలియజేసింది ప్రేమలత. అయితే ఆయనకు ట్రాకిమోస్టోమి అని దీనివల్లే వెంటిలేటర్ పైన ఉంచారని కృత్రిమ శ్వాస క్రియ చేస్తున్నారని తెలియజేశారు.
అలాగే ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ విజయకాంత్ ను కూడా కలిశారని తనని ఓదార్చని తప్పుడు ప్రచారాన్ని పలు యూట్యూబ్ ఛానల్స్ సైతం స్ప్రెడ్ చేస్తున్నాయని తెలియజేస్తోంది. ఇలాంటి వార్తలకు పార్టీ కార్యకర్తలకు మా కుటుంబ సభ్యులకు బంధువులకు సినీ పరిశ్రమకు చాలా మనోవేదనను సైతం కలిగిస్తున్నాయని తెలియజేయడం జరిగింది అయితే హాస్పిటల్లో తామంతా క్షేమంగానే ఉన్నామని తెలిపారు. దయచేసి ఎలాంటి పుకార్లను సైతం వ్యాప్తి చేయకండి అంటూ తెలియజేసింది ప్రేమలత విజయకాంత్ త్వరలోనే ఆరోగ్యంగా బయటికి రాబోతున్నారని ఆయన అభిమానులను కూడా కలుస్తారని తెలియజేశారు. తన రెండో కుమారుడు షణ్ముగ పాండియన్ తో కలిసి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.