విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చేది అప్పుడేనా..?
ఇందు లో హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తోంది. మేకర్స్ ఈ సినిమాని డిసెంబర్ 8వ తేదీన విడుదల చేయడానికి సన్నహాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా షూటింగ్లో కాస్త ఆలస్యంగా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మరో 10 రోజులు సమయం పడుతుందట.. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు పలు రకాలుగా సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం.
అయితే ఈ విషయం పైన మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటికే లాంచ్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.సితార బ్యానర్ నుంచి ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు ఇందులో హీరోయిన్ అంజలి కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ సినిమా విడుదల తేదీ పైన విశ్వక్ సేన్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అసలు రానని కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ షేర్ చేయడం జరిగింది.