చిరు దిల్ రాజు అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఎప్పటినుంచో తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా అది అనిల్ రావిపూడి ద్వారా తీరబోతోంది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో తన 50వ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజుకి మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ అయినట్లు సమాచారం తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి కథ చర్చలు అనేవి జరుగుతున్నాయట. మెగాస్టార్ చిరంజీవికి లైన్ నచ్చడంతో ఫైనల్ వెర్షన్ విన్నాక ప్రాజెక్ట్ ని ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది డిసైడ్ చేస్తారట. ఇక ప్రాజెక్ట్ లాక్ అయ్యాకే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం తెలుస్తోంది.ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లతో రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. కమర్షియల్ కథలకి కామెడీ డోస్  పెంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ డైరెక్టర్ రీసెంట్ గా 'భగవంత్ కేసరి' సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.



ఇక ఇప్పుడు చిరుతో మూవీ చేస్తున్నాడనే న్యూస్ బయటికి రాగానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో చంటబ్బాయ్ లాంటి ఎంటర్టైన్మెంట్ మూవీని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఆయన్ని ఒక రేంజ్ లో చూపిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఆయనతో ఎలాంటి సబ్జెక్ట్ తో సినిమా తీస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటి దాకా మెగా ఫ్యామిలీలో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలన్న కోరికను వకీల్ సాబ్ ద్వారా తీర్చుకున్న దిల్ రాజు ఇప్పుడు చిరంజీవితో తన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకోబోతున్నాడు.ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరితో తన బ్యానర్లో సినిమాలు చేయాలన్నదే దిల్ రాజు కోరిక. అందుకే ఓవైపు యంగ్, స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు ఆల్రెడీ ఇప్పటికే కోలీవుడ్లో స్టార్ హీరో తలపతి విజయ్ తో 'వారిసు' మూవీని నిర్మించి అక్కడ కూడా హిట్ కొట్టాడు. రీసెంట్ గా రజినీకాంత్ తో చెయ్యాలనుకున్న సినిమా కొంచెంలో మిస్ అయింది. మళ్ళీ ఆయనతో సినిమా కోసం దిల్ రాజు ట్రై చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: