బాలయ్య చిత్రంలో దుల్కర్ సల్మాన్ .. అసలు నిజం ఇదే..!!

Divya
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. తన నటనతో డైలాగులతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలయ్య.. 1974లో విడుదలైన తాతమ్మకల అనే సినిమాతో తన సినీ కెరియర్ని సైతం ప్రారంభించారు. ఇప్పుడు యంగ్ హీరోలకు సైతం పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు. ఈ ఏడాది వరసగా రెండు సినిమాలను విడుదల చేసిన బాలయ్య ఈసారి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత నాగ వంశి భారీ బడ్జెట్ తోనే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా యాక్షన్ మూవీ అని ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యిందని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపించాయి. మహానటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు సీతారామం చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు దుల్కర్ సల్మాన్.

తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు మమ్ముట్టి కుమారుడే ఈ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్లో అవకాశాలు వస్తున్న తరుణంలో పలు సినిమాలను ఒప్పుకొని నటిస్తూ తన సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించలేదని ఇదంతా కేవలం రూమర్సే అన్నట్లుగా తెలుస్తోంది. ఫేక్ న్యూస్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో సృష్టిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. డైరెక్టర్ బాబి గతంలో కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో గొడ్డలి దానిమీద రేబాన్ గ్లాసెస్ చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: