సలార్ ను కార్నర్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్

Seetha Sailaja
ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రీత్యా దర్శకుడు ప్రశాంత్ సక్సస్ ట్రాక్ రీత్యా ‘సలార్’ మూవీని తెలుగు రాష్ట్రాలలో బయ్యర్లకు అత్యంత భారీ రేట్లకు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో కేవలం తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ మూవీ బయ్యర్లు సేఫ్ జోణ్ లోకి వెళతారని లేకుంటే ఈమూవీ బయ్యర్లకు కష్టాలు తప్పవు అంటూ కొందరు ఈమూవీ పై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు.



మరికొందరైతే తెలుగు రాష్ట్రాలలో ‘సలార్’ ‘ఆర్ ఆర్ ఆర్’ రేంజ్ లో కలక్షన్స్ వసూలు చేసి తీరాలని లేకుంటే బయ్యర్ల పెట్టుబడికి నష్టాలు తప్పవు అంటూ మరొక నెగిటివ్ అంశాన్ని ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. వాస్తవానికి 2 సంవత్సరాల క్రితం విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత ఆ రేంజ్ లో కలక్షన్స్ రాబట్టిన సినిమా మరొకటి లేదు. దీనితో ‘సలార్’ కు ఆ రేంజ్ మ్యానియా ఉందా అంటూ మరికొందరు ఆశ్చర్య పోతున్నారు.



మరికొందరైతే ‘సలార్’ విడుదలైన మూడు వారాల పాటు ఆసినిమా విడుదలైన ధియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడినప్పుడు మాత్రమే ‘సలార్’ బయ్యర్లు ఎంతోకొంత లాభ పడతారని ఇండస్ట్రీలోని ఒక వర్గం అభిప్రాయ పడుతోంది, ‘సలార్’ విడుదలైన కేవలం మూడు వరాలకె సంక్రాంతి సినిమాల హంగామా మొదలవుతుంది కాబట్టి ఈసినిమాల విడుదలలోపే కేవలం మూడు వారాళాలో ‘సలార్’ ఎలా అద్భుతాలు చేయగలదు అంటూ విశ్లేషణలు చేస్తున్నారు.  


మరొక వైపు డిసెంబర్ మొదటి వారం నుండి భారీ అంచనాలు ఉన్న ‘యానిమల్’ ‘హాయ్ నాన్న’ లాంటి భారీ అంచనాలు ఉన్న సినిమాలు విడుదల అవుతున్న పరిస్థితులలో ఆసినిమాల పోటీతో పాటు ప్రస్తుతం బ్లాక్ బష్టర్ హిట్స్ తో దూసుకు పోతున్న షారూఖ్ ఖాన్ ‘డంకీ’ ఇలా అనేక భారీ అంచనాలు ఉన్న సినిమాల మధ్య ‘సలార్’ నిలబడాలి అంటే ఆమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చి తీరాలి..



 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: