యానిమల్ చిత్రంలో రష్మిక పాత్ర అదేనా..?
యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ పాత్రతో పాటు ఇందులో నటించే ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా స్పెషల్ గానే ఉంటుందంటూ మేకర్స్ తెలియజేశారు. ముఖ్యంగా రస్మిక పాత్ర ఆమె నటన ఈ సినిమాకి చాలా అట్రాక్షన్ గా నిలవబోతోందని తెలుపుతున్నారు. రష్మిక ఎమోషనల్ సన్నివేశాలలో కూడా నటించిందని తెలుపుతున్నారు. ముఖ్యంగా రణబీర్ కపూర్ ప్రవర్తన వల్ల ఆయన భార్య అయినటువంటి రష్మిక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఆ సన్నివేశాలలో రష్మిక జీవించిపోయి మరి నటించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక తన అందాల ఆరబోతతో ఇప్పటివరకు కెరియర్ ని నెట్టుకు వచ్చిందని ట్రోల్ చేసే వారికి ఈ సినిమాతో తనెంటో ప్రూఫ్ అవుతుందని తెలుస్తోంది.
మరొకవైపు రష్మిక తెలుగులో ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తోంది.మొదటి భాగంలో నటించిన అందుకు ఈమెకు పెద్దగా స్కోప్ లేకపోయినా కేవలం పాటలు స్కిన్ షో తోనే బాగా ఆకట్టుకుంది ఇప్పుడు రెండవ పార్టులో పుష్ప భార్యగా ఈమె నటించబోతోంది ఈ సినిమాతో పాన్ ఇండియా లేవలో పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక ఆ తర్వాత యానిమల్ సినిమాలో నటిస్తూ ఉండడంతో మరింత క్రేజ్ ఏర్పడుతోంది. ఇవే కాకుండా పలు రకాల లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా రష్మిక నటిస్తున్నట్లు తెలుస్తోంది గత కొద్దిరోజులుగా ఒక ఫేక్ వీడియో వల్ల కూడా ఈమె పేరు బాగా వినిపిస్తోంది.