ఆ కారణంగా నేడు సూపర్ స్టార్ కృష్ణ ను గుర్తు చేసుకుంటున్న అభిమానులు...!!

murali krishna
సూపర్ స్టార్ కృష్ణ.. ఈ పేరు తెలుగు ఉన్నంత కాలం గుర్తుండిపోయే పేరు. సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణ.. ఎందరో మహానుభావులతో పాటు తెలుగు స్థాయిని పెంచారు కృష్ణ.తెలుగు ను కొత్త పుంతలు తొక్కించిన కృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాత తన ప్రతిభను చాటుకున్నారు కృష్ణ. దాదాపు 350కు పైగా ల్లో నటించి మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణ మరణం ఆయన అభిమానులతో పాటు మహేష్ బాబుకు తీరని లోటును మిగిల్చింది. నేడు సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి.కృష్ణ వర్ధంతి కావడంతో ఆయనను గుర్తు చేసుకుంటూ అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. కృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములో బుర్రిపాలెంలో జన్మించారు. అక్కినేని నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కృష్ణ. ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు ఓసారి ఘనస్వాగతం పలికారు. అది చూసిన కృష్ణ హీరో అవడం వల్లే ఇంత ప్రజాదరణ లభించిందని గ్రహించి తాను కూడా నటుడు కావాలని నిర్ణయించుకున్నారు.

తేనె మనసులు తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. కృష్ణ 90వ దశకం వరకూ విపరీతమైన బిజీగా ఉండేవారు. రోజులో ఏకంగా మూడు షిఫ్ట్ లు పని చేశారు కృష్ణ అలాగే ఏడాదికి అత్యధిక ల్లో నటించి రిలీజ్ చేశారు కృష్ణ. ఏడాదికి కృష్ణ నటించిన 10 లకు రిలీజ్ అయ్యాయి. కృష్ణ మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. 2022 నవంబరు 15న కార్డియాక్ అరెస్ట్ కారణంగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు .కృష్ణ తన జీవితంలోని ఆఖరి మూడు సంవత్సరాల వ్యవధిలో రెండవ భార్య విజయనిర్మల (2019),పెద్ద కొడుకు రమేష్ బాబు (2022), మొదటి భార్య ఇందిరా దేవి (2022)ల వరుస మరణాలు చూడవలసి వచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: