రామ్ చరణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తారక్, ప్రణతి.. ఏంటో తెలుసా..!?

Anilkumar
దీపావళి పండుగను ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలందరూ కూడా చాలా బాగా నిర్వహించుకున్నారు. అందులో భాగంగానే సెలబ్రిటీ లందరూ ఇతర సెలబ్రిటీలను తమ ఇంటికి ఆహ్వానించి ఘనంగా జరుపుకున్నారు. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీల నుండి మొదలుకొని టాలీవుడ్ లో ఉన్న కొందరు సెలబ్రిటీల వరకు అందరూ దీపావళి పండుగను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సైతం తెలుగు సినీ సెలబ్రిటీల అందరిని కూడా తన ఇంటికి ఆహ్వానించి ఘనంగా పార్టీ ఇచ్చారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా


టాలీవుడ్ స్టార్ హీరోల్లో నుండి మొదలుకొని చాలామంది మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి చేశారు. ఇందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి రాంచరణ్ ఇంట్లో నిర్వహించిన ఈ పార్టీకి రావడం జరిగింది. ఇకపోతే చరణ్ ఉపాసన దంపతులకు క్లిన్ కారా జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ కి హాజరవుతున్నటువంటి సెలబ్రిటీలందరూ కూడా తమ కూతురి కోసం వివిధ రకాల కానుకలు తీసుకువచ్చారని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి కూడా దీపావళి పండుగ


సెలబ్రేషన్స్ లో భాగంగా చరణ్ ఇంటికి వెళుతున్న నేపథ్యంలో తన కూతురి కోసం ఖరీదైన కానుకను తీసుకొని వెళ్ళారట. ఉపాసనకు యూస్ అండ్ త్రో ఐటమ్స్ పెద్దగా నచ్చవు అనే విషయం మనకు తెలిసిందే. ఉపాసన ఇష్టపడే విధంగానే తారక్ ప్రణతి ఉపాసన బేబీ కోసం ప్రత్యేకంగా ఈ టాయ్ సెట్ తీసుకువచ్చి చిన్నారికి అందజేశారు. అలా జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఈ చిన్నారికి ఇచ్చిన బొమ్మతో దాదాపుగా 5 సంవత్సరాల వరకు ఆడుకునే ఫెసిలిటీ ఉందట. అందుకే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇలా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకొని ఎన్టీఆర్ దంపతులు కూతురి కోసం ఈ గిఫ్ట్ తీసుకువెళ్లడంతో రామ్ చరణ్ దంపతులు సైతం చాలా సంతోషించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: