రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఈరోజు ఈ పార్టీలో ఉన్న నేత మధ్యాహ్నం వరకు మరో పార్టీలోకి జంప్ అవుతాడు.రాత్రి వరకు ఇంకో పార్టీలోకి వస్తాడు.అలా ఒక రాజకీయ నాయకుడు ఒకే పార్టీలో ఎప్పటికీ చివరి వరకు ఉంటారు అనేదానిపై క్లారిటీ ఉండదు.అవసరాలకు తగ్గట్టుగా పార్టీలు మారుతూ ఉంటారు. ఒక పార్టీలో అవమానం జరిగితే మరో పార్టీలోకి జంప్ అవుతారు. లేకపోతే ఒక పార్టీలో టికెట్ రాకపోతే మరో పార్టీలోకి వెళ్తారు.ఇదంతా రాజకీయాల్లో కామనే.. ఈ విషయం పక్కన పెడితే తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలన వార్త వైరల్ అవుతుంది.అదేంటంటే ఈటల రాజేందర్ ఘర్ వాపసి అవబోతున్నారని.. ఇక అసలు విషయం ఏమిటంటే..ఈటల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారనే ప్రచారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు.అలాగే గత ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.కానీ ఆయన బీజేపీలో చేరినప్పటికీ అందులో అస్సలు ఉండలేకపోతున్నారు.తరచూ బండి సంజయ్ తో విభేదాలు రావడంతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్లాలని చూస్తున్నారని కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈటల రాజేందర్ బిజెపి పార్టీపై మౌనం పాటించడంతోపాటు బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయలేదు. అంతేకాకుండా కేసీఆర్ మా బాస్ అంటూ ప్రకటించడంతో ఈటల రాజేందర్ మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం కోసం పరోక్షంగా సంకేతాలు జారీ చేస్తున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు.
అలాగే ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఇద్దరూ బీఆర్ఎస్ ని రాష్ట్రంలో లేకుండా చేస్తాం అని మాట్లాడిన మాటలపై కూడా ఈటల నాకు తెలియదని సమాధానం ఇచ్చారని సమాచారం. బండి సంజయ్ తో వచ్చిన విభేదాల గురించి బీజేపీ భవిష్యత్తు గురించి ప్రశ్నించినా ఈటల నోరు విప్పకుండా తెలియదని సమాధానాలు ఇచ్చారట. కాంగ్రెస్ నేతలు ఈటల రాజేందర్ ని కులం పేరుతో దూషించిన కూడా బిజెపిలోని ఏ ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ గా నిలవకపోవడంతో ఈటల అసంతృప్తితో ఉన్నారట. అంతేకాకుండా బిజెపిలోని గ్రూపు రాజకీయాలతో విసిగిపోయి మళ్ళీ తన సొంత పార్టీలోకి వెళ్దామని ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్లడం కోసం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం. మరి నిజంగానే ఈటల రాజేందర్ బిజెపి పార్టీని వదిలి తిరిగి సొంతగూటికి చేరుతారా అనేది తెలియాల్సి ఉంది.