చరణ్ సరసన సాయిపల్లవి.. ఏ మూవీలో తెలుసా?

praveen
సినిమాలతో మనం ఎంత సక్సెస్ సాధించాము అన్నది కాదు. సక్సెస్ సాధించిన తర్వాత ఇక వచ్చిన పాపులారిటీని ఎలా కాపాడుకున్నాం అన్నది ఇండస్ట్రీలో చాలా ముఖ్యం. ఇలా సక్సెస్ తర్వాత చెత్త సినిమాలు తీసి ఎంతోమంది కనుమరుకైన హీరోలు కూడా ఉన్నారూ. అందుకే ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ సక్సెస్ తో పొంగిపోయి వరుస సినిమాలు చేయకుండా.. కథల ఎంపికలు ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అలాంటి హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు.


 త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్టుతో ఒక్కసారిగా పాన్ వరల్డ్ హీరోగా మారిపోయాడు రామ్ చరణ్. అయితే ఇక ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే 2024లో తన కెరియర్ ప్లాన్ను మరింత స్పీడ్ అప్ చేయాలని అనుకుంటున్నాడట రామ్ చరణ్. ఈ క్రమంలోని తాను ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలు.. అన్నింటిని కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్స్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో రామ్ చరణ్ ఒక సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.


 స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక త్వరలోనే చిత్ర బృందం ఈ సినిమాపై క్లారిటీ ఇవ్వబోతుందట. అయితే వీరిద్దరి కాంబినేషన్ కావడంతో ఇక రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని.. సినీ విశ్లేషకులు అందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఈ మూవీ లో సాయి పల్లవి, రామ్ చరణ్ డాన్సులు కూడా మామూలుగా ఉండబోవట. కాగా ఈ మూవీ కోసం సాయి పల్లవి దాదాపు నాలుగు కోట్లు పారితోషకం తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: