ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న మాస్ మహారాజా..!?

Anilkumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న  జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. వార్ 2 అనే సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వార్ సినిమాకి సీక్వెల్ గా అయాన్ ముఖర్జీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సైతం నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ సైతం జరుపుకోబోతున్నట్లుగా సమాచారం.


అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాటలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నడుస్తున్నారు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మాస్ మహారాజ రవితేజ సైతం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటివలే 'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా సినిమా చేశారు రవితేజ. కాగా ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు ఆయన . హిందీ వెర్షన్ కు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు.


అయితే ఈ కష్టం వృధా పోలేదు. ఇప్పుడు రవితేజకు బాలీవుడ్ నుంచి అద్భుతమైన ఆఫర్ వచ్చింది. అక్కడ ఒక భారీ మల్టీస్టారర్ లో నటించే ఆఫర్ రవితేజని వెతుక్కుంటూ వచ్చింది. ఓ అగ్ర నిర్మాణ సంస్థ రవితేజతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ చేయడానికి రవితేజ సుముఖంగా వున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారక ప్రకటన రానుంది. ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు రవితేజ. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: