విశాఖలో సామాన్యుడిలా స్టార్ హీరో సింప్లిసిటీ..రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సందడి!
విశాఖ జిల్లా షీలా నగర్‌లోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గోపీచంద్ రాకతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.మింది సమీపంలో ఉన్న తన సొంత స్థలాన్ని డెవలప్‌మెంట్ కోసం ఇవ్వాలని గోపీచంద్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వేరొకరితో ఒప్పందం కుదుర్చుకోవడానికి (Development Agreement) ఆయన రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు.పది నిమిషాల్లో ఫినిష్: ఆన్ లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని వచ్చిన గోపీచంద్, బయోమెట్రిక్ ప్రక్రియను కేవలం పది నిమిషాల్లోనే పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఇంత వేగంగా జరగడం చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. .
గోపీచంద్ వచ్చాడన్న విషయం తెలియగానే కార్యాలయ సిబ్బందితో పాటు అక్కడికి వచ్చిన సామాన్యులు కూడా ఫోటోల కోసం ఎగబడ్డారు.సబ్ రిజిస్ట్రార్ తారకేసు అండ్ టీమ్ గోపీచంద్‌కు ఘనస్వాగతం పలికారు. . అధికారులతో కాసేపు ముచ్చటించిన గోపీచంద్, అందరితో కలిసి చిరునవ్వుతో ఫోటోలు దిగారు.షూటింగ్‌లో బిజీగా ఉండే స్టార్ హీరో ఇలా నేరుగా ఆఫీస్‌కు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు . . అధికారుల నుంచి అటెండర్ల దాకా ప్రతి ఒక్కరూ ‘మ్యాచో మ్యాన్’తో సెల్ఫీ దిగడానికి ఆసక్తి చూపించారు.గోపీచంద్ వైజాగ్ టూర్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది . . ‘భీమా’ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత గోపీచంద్ తన తదుపరి ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతూనే, ఇలాంటి వ్యక్తిగత పనులను చకచకా పూర్తి చేసుకుంటున్నారు . .