సీతారామం సినిమాలో సీతగా నటించి మెప్పించింది మృనాల్ ఠాగూర్. అయితే తాజాగా ఆమెకి సంబంధించిన ఒక వార్త సోషల్
మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. గతంలో మృణాళిక తెలుగు అబ్బాయిని
పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలు తెగ వినిపించాయి. వాటిని మీడియా ద్వారా చాలా సింపుల్గా కొట్టి పారేసింది. తాజాగా మళ్లీ ఇప్పుడు ఒక
బాలీవుడ్ సింగర్
బాద్షా తో డేటింగ్ లో ఉంది అన్న వార్తలు తెరపైకి వచ్చాయి.
శిల్పా శెట్టి ఇచ్చిన
దీపావళి పార్టీలో వారి ఇద్దరికీ సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ పార్టీలో భాగంగా మృణాల్ ఠాకూర్
బాదుషా చేతిలో చేయి వేసి చాలా క్లోజ్ గా కనిపించారు. శిల్పాలతో కలిసి వీళ్ళిద్దరూ ఫోటోల సైతం దిగారు. అందులో భాగంగానే ఇప్పుడు వీరిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది వారిద్దరికీ సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ మృణాల్ ఠాగూర్ ప్రేమలో పడిపోయింది అంటూ వైరల్ చేస్తున్నారు. ఈ
పార్టీ తర్వాత ఇద్దరూ చేతిలో చేయి వేసి బయటకు వచ్చారు. అంతేకాదు ఇద్దరూ ఒకే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఫొటోలు, వీడియోలు ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న వార్తలను మరింత బలపరిచాయి. బాద్షాతో కలిసి తాను పార్టీలో దిగిన ఫొటోలను మృణాల్ తన ఇన్స్టా స్టోరీల్లో పోస్ట్ చేసింది.
తమ డేటింగ్ పుకార్లపై ఈ ఇద్దరూ ఇంకా స్పందించలేదు. ఇక ఈ సింగర్ ఎవరో అన్న విషయానికి వస్తే..
బాద్షా ఓ ర్యాపర్, సింగర్, యాక్టర్, ఫిల్మ్ మేకర్. అతని అసలు పేరు
ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. అతని తొలి పాట
డీజే వాలే బాబు. ఈ పాట రిలీజైన 24 గంటల్లోనే ఐట్యూన్స్ చార్ట్స్ లో నంబర్ వన్ గా నిలవడం విశేషం.
పంజాబ్ లో ఓ హిందూ రాజ్పుత్ ఫ్యామిలీలో జన్మించిన బాద్షా.. 2014 నుంచి
బాలీవుడ్ సినిమాల్లోనూ పాటలు పాడుతున్నాడు. ఇదిలా ఉంచితే ఈ సింగర్ ఇదివరకే
జాస్మిన్ అనే ఒక అమ్మాయిని
పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అనంతరం 2020లో వీళ్ళిద్దరూ వెళ్లిపోయారు. దీంతో మృణాల్ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు..!!