అందుకే నా జీవితం నాశనం అయ్యింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..!?

Anilkumar
స్టార్ హీరోయిన్ సమంత గత రెండేళ్లుగా ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 2017 లో నాగచైతన్య మరియు సమంత ఇద్దరూ పెళ్ళి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల వాళ్ళిద్దరూ అక్టోబర్ 2021 లో విడాకులు తీసుకున్నారు. అయితే ఒకవైపు ప్రేమ పెళ్లి కూడా ఫెయిల్ అవ్వడంతో చాలా మానసిక సంఘర్షణలకు గురైంది సమంత.తను మయోసైటిస్  వ్యాధితో ఇబ్బంది పడుతూ ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది. రీసెంట్ గా సమంత నటించిన ఖుషి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం ఈమె బయోసైటిస్ వ్యాధికి భూటాన్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తాజాగా సమంత ఇలాంటి టైంలో ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడడం జరిగింది. తన లైఫ్ లో ఎదురైన కష్టాల గురించి తెలిపింది ముఖ్యంగా తన ప్రేమ పెళ్లి హెల్త్ ఇష్యూ వంటి సమస్యల గురించి కూడా చెప్పింది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే... మీ లైఫ్ లో జరిగిన మంచి చెడుల గురించి మీ జీవిత ఆలోచనల గురించి ఎవరైనా మాతో షేర్ చేసుకుంటారా అని యాంకర్ అడగగా... దానికి సమంత నేను యాక్టర్ గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాను కానీ ఆ సమయంలోనే నా మ్యారీడ్ లైఫ్ ముగిసిపోయింది. దీనితో నా హెల్త్ కూడా దెబ్బతింది.

అది నా వర్క్ మీద చాలా ఎఫెక్ట్ ని చూపిస్తుంది. అయితే దీనితోపాటు నేను చేసిన సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. ఈ మూడు కూడా నా లైఫ్ లో చాలా ఇబ్బందికరమైన సిచువేషన్ అని సమంత తెలిపింది. నేను గత రెండేళ్లుగా భరించిన బాధ కంటే ప్రజలు దిగజారిపోయి మాట్లాడుకునే మాటలు నాకు చాలా బాధను కలిగిస్తాయి.  ఒకవైపు హెల్త్ ప్రాబ్లం తో మరోవైపు ఎన్నో కష్టాలు నన్ను చుట్టుముట్టాయి దీనితోపాటు ట్రోలింగ్ నెగిటివిటీ వార్తలు ఎక్కువగా వచ్చాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొని తనను తాను చాలా బలంగా చేసుకున్నానని సమంత తెలిపింది. తనను అభిమానించే అభిమానులు ఈ దేశంలో ఉండడం నాకు అందిన బహుమతి అని తాను తెలిపింది. అయితే వాస్తవానికి నా కష్టమే నాకు బలం నా శక్తితోనే నేను పోరాడుతానని సమంత తెలిపింది...!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: