మరోసారి బన్నీతో చిందులేయబోతున్న సమంత..!!

Anilkumar
 పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'పుష్ప 2' ముందు వరసలో ఉంటుంది. 'పుష్ప: ది రైజ్' నేషనల్ వైడ్ గా విజయం అందుకోవడంతో పార్ట్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. 'పుష్ప 2' కి సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా నెట్టింట ఫుల్ వైరల్ అయిపోతుంది. రీసెంట్ గానే 'పుష్ప 2' న్యూ షెడ్యూల్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ హడావిడి చేస్తోంది. అదేంటంటే, 'పుష్ప2' లో మరోసారి బన్నీతో స్టెప్పులేయబోతుందట సమంత. పుష్ప: ది రైజ్ మూవీలో 'ఊ అంటావా మావా' అంటూ సమంతతో స్పెషల్ సాంగ్ చేయించాడు సుకుమార్.


 ఆ పాట ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవ్వడంలో 'ఊ అంటావా' సాంగ్ కూడా ప్రధాన కారణమని చెప్పడంలో సందేహం లేదు. ఈ పాటలో అల్లు అర్జున్ తో కలిసి సమంత వేసిన హాట్ స్టెప్స్ కి సినీ లవర్స్ ఫిదా అయిపోయారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ పాటలో సమంత గ్లామర్ షో చేయడంతోపాటు డాన్స్ ఇరగదీసింది. దీంతో పాన్ ఇండియా లెవెల్ లో ఈ పాటకు భారీ ఆదరణ లభించింది. కాగా పార్ట్ 2 లో మరింత గ్రాండ్ గా ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ నుంచి మొదలుకొని కోలీవుడ్, 


మాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ హీరోయిన్స్ తో చర్చలు జరిపినా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో మళ్లీ సమంతనే రంగంలోకి దించాలని భావిస్తున్నాడట. గత కొన్ని రోజులుగా 'పుష్ప2' ఐటమ్ సాంగ్ గురించి చర్చలు జరుగుతుండగా తాజాగా ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని అంటున్నారు. మళ్లీ సమంత తోనే 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. కేవలం ఐటమ్ సాంగ్ మాత్రమే కాకుండా సినిమాలో కొన్ని సన్నివేశాల్లోనూ ఆమెను నటింపజేయాలని అనుకుంటున్నారట. దీనిపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఫిలిం సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ ప్రచారం అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: