టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో శర్వానంద్ ఒకరు. ఇకపోతే ఈయన ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ... వెన్నెల కిషోర్ , ప్రియదర్శి మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ తన కెరియర్ లో 30 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.
శర్వానంద్ తన కెరీర్ లో 30 వ మూవీ షూటింగ్ దశలో ఉండగానే తన తదుపరి మూవీ కి సంబంధించిన పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఓ దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ మూవీ కి నిర్మాత కూడా ఇప్పటికే ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక శర్వానంద్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే ... తాజాగా శ్రీ విష్ణు హీరోగా సామజవరగమన అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు శర్వానంద్ కు ఓ కథను వినిపించగా ... ఆ కథ నచ్చడంతో శర్వా వెంటనే ఈ దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని ఏకే ఎటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించబోతున్నట్లు ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.