కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం ఇండియన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యి అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ దర్శకుడు శంకర్ ... కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ మొదలు అయిన కొంత కాలానికే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొంత కాలం పాటు ఆగిపోయింది.
ఇక మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ ను ఈ మూవీ బృందం వారు మళ్ళీ ప్రారంభించారు. ఇక అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యొక్క చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇలా ఈ మూవీ యొక్క షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఈ మూవీ నిడివి చాలా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇండియన్ 2 మూవీ ని విడుదల చేసిన కొంత కాలానికే ఇండియన్ 3 మూవీ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ఈ చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక అందుకోసం ఇప్పటికే ఈ మూవీ నిర్మాతలు ఈ సినిమా హీరో అయినటువంటి కమల్ హాసన్ ఈ సినిమా దర్శకుడు అయినటువంటి శంకర్ తో ప్రత్యేక ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమా యొక్క రెండవ భాగం కోసం కొన్ని రోజులను ప్రత్యేకంగా కేటాయించనున్న వీరికి ప్రత్యేక రెమ్యూనిరేషన్ ను కూడా ఈ మూవీ నిర్మాతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.