వావ్: హీరోయిన్లను మించి పాపులారిటీ సంపాదిస్తున్న సితార.. దీపావళి స్పెషల్..!!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుగా సితార అందరికీ సుపరిచితమే.. గత కొంతకాలంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పరచుకుంటోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా అవుతూ ఉంటుంది. అతి చిన్న ఏజ్ లోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార ఇటీవల ఒక యాడ్ ద్వారా కూడా మరింత పాపులారిటీ అందుకుంది. ఇక తన తండ్రి బాటలోనే ఎన్నో మంచి పనులు చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంతోంది సితార.

చదువుతో పాటు మరొక పక్క కల్చరల్ కి సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకుంటూ ప్రతి పండగకి చాలా పద్ధతిగా తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తూ ఉంటుంది. సితారకు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా దీపావళి సందర్భంగా ఉదయాన్నే లేచి తన ఇంటి ముందు ముగ్గులు వేయడం జరుగుతోంది.తన ఇంట్లో పనిచేసే వాళ్ళతో కలిసి సితార ఇలా ముగ్గులు వేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు తాను వేసిన ముగ్గులను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

అలాగే గాగ్రా చోళీ దుస్తులను దీపం పట్టుకొని చాలా స్పెషల్ గా కనిపిస్తోంది. సితార దీంతో అభిమానులు సైతం ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి దీపావళి స్పెషల్ ఫొటోస్ సితార అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అభిమానులు ఫాలోవర్స్ కూడా సితార పాపకి హ్యాపీ దీపావళి అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సితార త్వరలోనే హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు పలు రకాల సన్నహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మహేష్ బాబు కూతురు ఇతర హీరోయిన్లను మించిపోయి మరి పాపులారిటీ సంపాదించుకుంటోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా మహేష్ కూతురు అనిపించుకుంది సితార.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: