ఆ విషయంలో పోలిసులను ఆశ్రయించిన 'గేమ్ చేంజర్' మూవీ మేకర్స్....!!

murali krishna
గ్లోబల్ స్టార్ రాంచరణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్‌ ఛేంజర్‌.. రాంచరణ్ 15 వ సినిమా గా వస్తున్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్‌  దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ "జరగండి జరగండి" పాట ను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ లోపే ఈ సాంగ్‌ ఆన్‌లైన్‌ లో లీకైంది.లీక్స్‌ జరుగకుండా మేకర్స్‌ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ సాంగ్ లీక్‌పై మేకర్స్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీక్‌ పై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్‌ క్రైమ్స్‌ డివిజన్‌ ఏసీపీ చంద్రభాషా, ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్‌ఐ ప్రసేన్‌ రెడ్డి మరియు ఎస్‌ఐ సాయితేజ శ్రీ బృందం భవిష్యత్తు లో పైరసీ ఘటనలు జరగకుండా హెచ్చరికల ను జారీ చేశారు.గేమ్‌ ఛేంజర్‌ సినిమా లో రాంచరణ్ డ్యుయల్  రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం..పొలిటికల్ థ్రిల్లర్‌ జోనర్‌ లో వస్తున్న ఈ మూవీలో తెలుగు నటి అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నారు.అలాగే ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, సముద్రఖని, జయరాయ్‌ మరియు సునీల్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ కు పాపులర్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు.. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా కు డైలాగ్స్ అందిస్తున్నారు.గేమ్ చేంజర్ సినిమా త్వరలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: