కేరళలో 'సలార్' ని రిలీజ్ చేస్తున్న పృద్వీ రాజ్ ప్రొడక్షన్స్..!!

Anilkumar
కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ అభిమానులతో పాటు సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈపాటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తోంది.
 మొదట సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ అనుకున్నారు. కానీ అవుట్ ఫుట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రశాంత్ నీల్ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశాడు. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయాలని మూవీ టీమ్స్ ప్లాన్ చేస్తున్న తరుణంలో మరోసారి 'సలార్' రిలీజ్ వాయిదా పడబోతుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

అందుకు కారణం బాలీవుడ్ బాద్షా నటించిన 'డంకీ' చిత్రం అని తెలుస్తోంది. షారుక్ ఖాన్ 'డంకీ' తో 'సలార్' పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే  కొద్ది రోజులుగా 'డంకీ' వాయిదా పడబోతుందని న్యూస్ వచ్చింది. కానీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. కట్ చేస్తే.. ఇప్పుడు 'సలార్' గురించి కొన్ని రూమర్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 22 నుంచి వచ్చే ఏడాది 'సలార్' మూవీని రిలీజ్ చేయబోతున్నారని ఓ ప్రచారం ఊపందుకుంది. సలార్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అందరూ నిజమే అనుకున్నారు. కానీ తాజాగా మూవీ టీం ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ ఓ అదిరిపోయే అప్డేట్ అందించింది.

 అదేంటంటే, 'సలార్' మూవీ కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దక్కించుకున్నారు. 'సలార్' లో ఆయన విలన్ గా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే పృధ్విరాజ్ ప్రొడక్షన్స్ 'సలార్' మూవీని కేరళలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇదే పోస్టర్ లో 'సలార్' వరల్డ్ వైడ్ డిసెంబర్ 22న విడుదల కాబోతుందని స్పష్టం చేయడంతో సినిమా మరోసారి వాయిదా పడబోతుందని వస్తున్న వార్తలకి చెక్ పడినట్లయింది. 'కేజిఎఫ్' సినిమాని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: