తాజాగా
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు
కాదంబరి కిరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగానే అక్కినేని
నాగార్జున పై కొన్ని సంచలన కామెంట్లను చేశారు. దాంతోపాటు అక్కినేని ఫ్యామిలీ పై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.
" నేను ఈనాడులో ఉద్యోగం చేసే వాడిని. ఓ
టీవీ సీరియల్ లో కనిపించడంతో నాకు ఓ మెమో ఇచ్చారు. ప్రతి కొత్త ఛానల్ లో నేను సీరియల్ ప్రొడ్యూస్ చేశాను. నేను ఓ వాచ్ మెన్, ఇండస్ట్రీలోని గుడ్, బ్యాడ్ అన్నీ నాకు తెలుసు. ఆ రోజు నేను ఒంటరి వాడిని. నాకు ఇష్టం లేదంటే స్పాట్లో ఇష్టం లేదని చెబుతాను. 'కుర్రాళ్ళ రాజ్యం' అనే
సినిమా తర్వాత
నాగార్జున గారికి ఓ కథ చెప్పాలని ఆయన ఇంటికి వెళ్లాను.
నేను చెప్పే కథ వినడానికి
నాగార్జున ఏకంగా రెండున్నర గంటలకు కూర్చున్నారంటే అది ఒక అద్భుతం. కానీ నేను చెప్పిన కథకు నాగర్జున రెండు సీన్లను కరెక్షన్ చేయమని తెలిపారు. 17 ఏళ్ళు గెలిచిన ఆ రెండు సీన్ల కరెక్షన్ మాత్రం ఇప్పటికీ ఆయన వినడం లేదు. అది ఆయన తప్పు కాదు. ఆయన ఇంకా సినిమాల్లో
హీరో గానే ఉన్నాడు. నేను ఇండస్ట్రీలోనే ఉన్నా. సో అది నా తలరాత, వదిలేసేయాలి అంతే.
సినిమా ఇండస్ట్రీలో
డార్లింగ్ అనే పదాన్ని కనిపెట్టింది నేనే. ఆ డైలాగును
పూరి జగన్నాథ్ బుజ్జిగాడు మూవీలో పెట్టుకున్నారు. ఆ తర్వాత
ప్రభాస్ కి అది ఊతపదంగా మారిపోయింది" అని అన్నారు.
నాగార్జున గారితో మీరు తీయాల్సిన బావ
మూవీ ఎందుకు మధ్యలోనే
ఆగిపోయిందని అడిగితే.." అది నా ఫేట్ అంతే. ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు. ఆయన క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. కొంతమందికి కొన్ని వర్కౌట్ అయితే కొంతమందికి వర్కౌట్ కావు. ఆ తర్వాత
రమ్యకృష్ణ గారితో గజ్జల గుర్రం అనే
సినిమా చేశా. అది వర్క్ అవుట్ అవ్వలేదు తర్వాత
సిమ్రాన్ గారితో ఓ
సినిమా ప్లాన్ చేసాం.. ఇవన్నీ అవడం లేదని ఆగకుండా
టెలివిజన్ ప్రొడక్షన్ చేసుకుంటూ
టీవీ సీరియల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ అక్కినేని నాగేశ్వరావు గారితో పరిచయం ఏర్పడింది. అంటూ చెప్పుకొచ్చారు కాదంబరి కిరణ్..