టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `గుంటూరు కారం` సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ మాస్ లుక్ ఇంకా గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ ని పక్కా మాస్ గా లాంచ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ హీరో ఎలివేషన్ ఆకట్టుకుంటుంది. ఎస్ ఎస్ రాజమౌళితో పాన్ ఇండియాని టచ్ చేసే ముందు మహేష్ కి భారీ కమర్శియల్ సక్సెస్ ఇచ్చే చిత్రంగా `గుంటూరు కారం`ని గురూజీ డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది.టైటిల్ సహా ఇప్పటి దాకా వచ్చిన అప్ డేట్స్ అన్ని సినిమాపై అంచనాలని అంతంతకంతకు రెట్టింపు చేసినవే. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమోని కూడా రిలీజ్ చేసారు.ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ థమన్ మాస్ బీట్లు ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తన్నాయి. ఇక `ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండీ.. ఎగబడి ముందరకే వెళ్లిపోతాది నేనెక్కిన బండి` అంటూ సాగే పాటతో ప్రోమో మొదలవుతుంది.
బ్యాక్ గ్రౌండ్ లో మహష్ బాబు ఎలివేషన్లు అదిరిపోయాయి.ఈ గుంటూరు కారానికి మసాలా బిర్యానీ ఘాటు తోడైతే ఎలా ఉంటుందో? మహేష్ బాబుని వీలైనతంగా మాస్ కోణంలో హైలైట్ చేసారు. ఇది మహేష్ మాస్ ఎంట్రీ సాంగ్ లాగా ఉంది. కొన్ని సెకన్ల బీట్లుతో మాస్ ఆడియన్స్ లో పూనకాలు తెప్పించాడు థమన్.ఇక ఫుల్ సాంగ్ లో గుంటూరోడి ఘాటు ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు. ఈ సాంగ్ ప్రోమోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ పాట ఫుల్ వీడియోని రేపు రిలీజ్ చేయనున్నారు.ఇక సూపర్ స్టార్ మహేష్-థమన్ కాంబినేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో `దూకుడు`..`బిజినెస్ మెన్` లాంటి చిత్రాలకు థమన్ సంగీతం అందించాడు. అవి అప్పట్లో మ్యూజికల్ గా సంచలనం సృష్టించాయి. దీంతో ఆగడు సినిమాకి కూడా థమన్ ని తీసుకున్నారు. సినిమా ప్లాప్ అయినా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో సర్కారు వారి పాట వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మరోసారి గుంటూరు కారం తో ఈ కాంబినేషన్ చార్ట్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి.