టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ - త్రివిక్రమ్ మూడో సారి జత కడుతుండటంతో ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటీకే చాలా సార్లు వాయిదా పడిన గుంటూరు కారం సినిమా సంక్రాతికి జనవరి 12న ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేసి తీరుతామని నిర్మాత నాగవంశీ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సాంగ్ దసరాకి రిలీజ్ చేస్తామని చెప్పినా దసరా అయిపోయి దీపావళి కూడా వస్తుండటంతో అభిమానులు ఎంతగానో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం గుంటూరు కారం సాంగ్ అంటూ మసాలా బిర్యానీ.. అనే ఓ పాట లీక్ అయి నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో గుంటూరు కారం చిత్రయూనిట్ ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా.. ప్రోమోని నేడు విడుదల చేస్తామని ప్రకటించారు.
ఇక ఈరోజు ఉదయం 11: 07 నిమిషాలకు గుంటూరు కారం సినిమా నుంచి దమ్ మసాలా అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. ఇందులో ఎలాంటి వీడియో బైట్స్ చూపించకుండా కేవలం మోషన్ పోస్టర్ తోనే పాటని రిలీజ్ చేశారు.అయినా కానీ ఈ పాట ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్న పులి లాగా గుంటూరు కారం అప్డేట్ కోసం ఎదురు చూశారు. అందువల్ల ఈ సాంగ్ ప్రోమోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.ఫుల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఇంకా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుందని మూవీ టీం భావిస్తుంది. అలాగే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిద్దో..