ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ తో దూసుకుపోయిన మూవీ...!!

murali krishna
తరుణ్ భాస్కర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో  తరుణ్ భాస్కర్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు..తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం 'కీడా కోలా'.. ఈ సినిమా లో బ్రహ్మనందం, చైతన్య రావు మరియు రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు.సరికొత్త క్రైమ్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత దాదాపు ఐదేండ్లు గ్యాప్ తీసుకుని తరుణ్ భాస్కర్ ఈ సినిమా తీయగా.. తొలి రోజు భారీగా వసూళ్లు రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్‌ల వర్షం కురిసింది.ఇక 'కీడా కోలా'  సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్‌లు చూసుకుంటే.. రూ.6.03 కోట్లు వసూలైనట్టు వివిధ రిపోర్టులు చెబుతున్నాయి. రానున్న రెండు రోజులు వీకెండ్ కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. మరోవైపు శుక్రవారం రోజే విడుదలైన సత్యం రాజేష్ ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా తొలిరోజు రూ. 3 కోట్ల కలెక్షన్‌లు రాబట్టింది.. ఈ సినిమా కు కూడా మంచి హిట్ టాక్ రావడంతో ఈ రెండు సినిమాలకు మంచి పోటీ ఏర్పడింది.. కీడా కోలా కథ విషయానికి వస్తే..వాస్తు(చైతన్యరావు) అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. అందులోంచి బయటపడాలంటే డబ్బు అవసరం. 

జీవన్‌(జీవన్‌కుమార్‌).. అనుకోకుండా అవమానాలపాలవుతాడు. ప్రతీకారం తీరాలంటే అతను కార్పొరేటర్‌ కావాలి. దానికీ డబ్బే అవసరం. వాస్తు తన తాత వరదరాజులు(బ్రహ్మానందం)కోసం తెచ్చిన కూల్ డ్రింక్ లో బొద్దంక కనిపిస్తుంది. ఎలాగూ డబ్బు అవసరం కాబట్టి.. దీన్నే అదనుగా తీసుకొని, లీగల్‌గా ప్రొసీడవుతామని సదరు కూల్ డ్రింక్ కంపెనీ వారిని బెదిరించి సొమ్ము చేసుకుందామని వాస్తు మిత్రుడు, న్యాయవాది అయిన కౌశిక్‌(రాగ్‌మయూర్‌) సలహా ఇవ్వడంతో అసలు కథ మొదలవుఉంది. ఇక జీవన్‌ విషయానికొస్తే.. తన అన్న నాయుడు(తరుణ్‌భాస్కర్‌) జైలునుండి విడుదలవ్వడంతో.. అన్న అండతో ఎలాగైనా కార్పోరేటర్‌ అవుదామని ఎంతో ఆశపడతాడు. కానీ దానికి కూడా డబ్బే అవసరం కావడంతో వాళ్లు ఓ ప్లాన్ వేస్తారు... ఇంతకీ జీవన్‌ అండ్‌ బ్యాచ్‌ వేసిన ప్లాన్ ఏంటి? కూల్ డ్రింక్ కంపెనీ వాళ్లను బెదిరించి వాస్తు అండ్‌ బ్యాచ్‌ డబ్బులు కొట్టేసారా.. ఇంతకీ వాస్తు, జీవన్‌లు డబ్బులు సంపాదించగలిగారా… అనేది మిగిలిన కథ..క్రైం కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను వీజీ సైన్మా బ్యానర్‌పై కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌ మరియు ఉపేంద్ర వర్మ నిర్మించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: