టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన చిత్రం 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా వంటి హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో ఇప్పటికే ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.ముఖ్యంగా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తుండడంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇంకా అంతేకాదు.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ గుంటూరు కారం సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ నిరీక్షణల గురించి చెప్పక్కర్లేదు. సినిమా గురించి కనీసం చిన్న అప్డేట్ అయినా వస్తుందా ? వేయి కళ్లతో ఎంతో ఎదురుచూశారు. నెట్టింట గుంటూరు కారం గురించి అనేక వార్తలు బాగా వైరలయ్యాయి.
ముందుగా హీరోయిన్ పూజా హెగ్డేని ఈ సినిమా నుంచి తొలగించడం ఆ తర్వాత ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరి ఇంకా శ్రీలీలని తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ రాబోతుంది. కొద్ది రోజులుగా ఈ విషయంపై ఫిల్మ్ వర్గాలో పెద్ద టాక్ నడిచింది. ఇప్పుడు అభిమానులు కోరుకున్నట్లుగా వారు ఎదురు చూసిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.ఇక ఈ సాంగ్ ఫుల్ వీడియోను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా అంటే నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారని సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.రేపు 11:07 గంటలకు ఫస్ట్ సాంగ్ ప్రోమోని విడుదల చేయనున్నారు.ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమా తరువాత రాజమౌళితో మహేష్ సినిమా చెయ్యనున్నాడు.