త్వరలోనే హైదరాబాద్ కోడలు కాబోతున్న మృణాల్ ఠాకూర్..!!

Divya
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో పలు అవకాశాలను అందుకున్న మృణాల్ ఠాకూర్ తనలోని గ్లామర్ యాంగిల్స్ ని బయట పెడుతూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. సీత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈ ముద్దుగుమ్మ సీతగా తెలుగు ప్రేక్షకుల మదిలో చరగని ముద్ర వేసుకుంది. టాలీవుడ్ లో ప్రస్తుత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది.

సీతారామం సినిమాతో ఈ అమ్మడు అన్ని అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మధ్యనే సైమా అవార్డులలో కూడా బెస్ట్ హీరోయిన్ గా అవార్డు అందుకుంది. నిర్మాత అల్లు అరవింద్ ఆశీర్వాదాలు అందుకోవడం జరిగింది టాలీవుడ్ లో బడనిర్మాత అయిన అల్లు అరవింద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో ఒక వేదికగా లావణ్య త్రిపాఠి ని పొగిడేస్తూ ఈమె హైదరాబాద్ కోడలు అవ్వాలి అంటూ ఆశీర్వదించారు. ఆమె ఏకంగా మెగా ఇంటి కోడలు కాబోతోంది. ఈ అమ్మడు ఇప్పుడు అదే విధంగా మృణాల్ ను కూడా  అల్లు అరవింద్ హైదరాబాద్ కి వచ్చేయమ్మా అంటూ ఆశీర్వదించారు.
ఒకప్పుడు నేను ఒక హీరోయిన్ ని బ్లెస్ చేశాను ఆమె కూడా హీరోని ప్రేమించి వివాహం చేసుకుని నువ్వు కూడా హైదరాబాద్కు రావాలని కోరుకుంటున్నానని చెప్పగా దీంతో మృణాల్ కూడా త్వరలోనే టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడుతుందని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు.. మరి టాలీవుడ్ లో ఏ హీరో తో రొమాన్స్ చేస్తుందో చూడాలి మరి ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటిస్తూ ఉండగా విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: