తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగించిన వెంకట్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ నటుడుకి సినిమా అవకాశాలు తగ్గాయి.
దానితో ఈయన కూడా సినిమా ఇండస్ట్రీ కి చాలా సంవత్సరాల పాటు దూరంగా ఉన్నాడు. అలా చాలా సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ నటుడు కొంత కాలం క్రితమే సుశాంత్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు సినిమాతో మళ్ళీ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ లో ఈ నటుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఇకపోతే తాజాగా ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన "ఓజి" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.
అందులో భాగంగా "ఓజి" మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వెంకట్ మాట్లాడుతూ ... నేను "ఓజి" మూవీ లో చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాను. నేను ఇప్పటికే ఆ సినిమాలో నా పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాను. నేను ఆ పాత్ర ఏమిటి అనేది అసలు మీకు చెప్పలేను. కాకపోతే ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈ మూవీ మన తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ... ప్రతిష్టను మరింత పెంచుతుంది అని వెంకట్ చెప్పుకొచ్చాడు.