కీడాకోలా చిత్రానికి గెస్ట్ గా విజయ్ దేవరకొండ..!!

Divya
ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు చిన్న సినిమాల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. అలా ఈ ఏడాది బేబీ,MAD తదితర సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఇలాంటి తరుణంలో యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సినిమాలను తెరకెక్కించడంలో మంచి క్రేజీ సంపాదించారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. తాజాగా ఈయన నుంచి కీడాకోలా అంటూ ఒక క్రైమ్ కామెడీ సినిమా రాబోతోంది. ఇందులో చైతన్య రావు, రవీంద్ర విజయ్, రాగ్ మయూరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారట. ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.


ఇందులో భాగంగా ప్రమోషన్స్ని సైతం చిత్ర బృందం వేగవంతంగా చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికి పలు రకాల అప్డేట్లను కూడా చిత్తర బృందం ఇస్తూనే ఉంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి టైముని ఫిక్స్ చేశారు.. ఈ రోజున హైదరాబాదులో ఎన్ కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో విజయ్ దేవరకొండ అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. మరి ఈ సినిమాకి ఎంతగా సహాయపడతారో చూడాలి మరి.


అందుకు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. బ్రహ్మానందం కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వీజీ సైన్మా బ్యానర్ పైన ఈ సినిమా తేరకెక్కించారు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి స్క్రిప్టును అందించగా ఉపేంద్ర వర్మ నిర్మించిన కీడాకోల వీజీ సైన్మ మొదటి పిక్చర్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో బ్రహ్మానందం పాత్రని మొదట అల్లు అరవింద్ చేత నటించాలని ప్లాన్ చేసిన ఇందుకు కొన్ని కారణాల చేత ఆ పాత్రను వదులుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: