HBD: తులసి నాయర్ ఆమె వల్లే హీరోయిన్ అవకాశాన్ని దక్కించుకుందా..?
ఇదిలా ఉండగా రాధా చిన్న కూతురు తులసి పుట్టినరోజు నేడు.. ఈ సందర్భంగా ఆమె గురించి తెలియని కొన్ని విషయాలను మనం చదివి తెలుసుకుందాం. తమిళ సినిమాలలో ఎక్కువగా నటించిన తులసి నాయర్ 2013లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమా ద్వారా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రవికేచంద్ర దర్శకత్వంలో వచ్చిన యాన్ సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే కడలి సినిమాలో నటించే అవకాశం ఆమెకు తన 14వ ఏటే వచ్చింది. 2011 నవంబర్లో సుహాసిని సిఫార్సు పై తులసిని ఎంచుకున్నాడు మణిరత్నం. అయితే హీరోయిన్ పాత్రకు ఆమె వయసు చిన్నది కావడంతో మొదట ఆమెను తిరస్కరించడం జరిగింది.
అయితే ఈ సినిమా కోసం సమంతను తీసుకోవడం ఆ తర్వాత ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో మళ్ళీ తులసిని తిరిగి తీసుకున్నారు మణిరత్నం. ఇక అలా ఈ సినిమా కథానాయకుడు గౌతమ్ కార్తీక్ , తులసిలకు మొదటి సినిమా కావడం గమనార్హం. నిజానికి 32 ఏళ్ల క్రితమే గౌతమ్ తండ్రి కార్తీక్ అలాగే తులసి తల్లి రాధ హీరో హీరోయిన్లుగా కలిసి తమ మొదటి సినిమాలో నటించడం.. తర్వాత మళ్ళీ వారి పిల్లలు ఇద్దరు కలిసి తమ మొదటి సినిమాలో ఇలా నటించడం నిజంగా గొప్ప విషయమని చెప్పవచ్చు.