వైరల్ గా మారిన దీపిక షాకింగ్ కామెంట్స్....!!
నేను నటిని కావచ్చని కానీ జన్మతః క్రీడాకారిణినని దీపిక కామెంట్లు చేశారు. లైఫ్ ను నేను ఆటలా భావిస్తానని ప్రపంచాన్ని మైదానం లా చూస్తానని దీపిక పేర్కొన్నారు. సినిమా హిట్టైన ప్రతిసారి కప్పు గెలుచుకున్న ఆనందం అని ఆమె చెప్పుకొచ్చారు. ఫెయిల్యూర్ ను కూడా హుందాగానే స్వీకరిస్తానని ఆమె పేర్కొన్నారు. నాకంటే బాగా నటించే వాళ్లు ఉండవచ్చని అయితే క్రమశిక్షణ విషయంలో మాత్రం నా తర్వాతే ఎవరైనా అని దీపిక తెలిపారు.భర్త రణ్ వీర్ తో తప్ప ఇంకెవరితో సినిమా లకు సంబంధించిన విషయాలను పంచుకోనని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మనస్సు విప్పి మాట్లాడుకునే స్థాయి లో చనువు భర్త దగ్గర మాత్రమే ఉందని దీపిక వెల్లడించారు. దీపిక చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా తెగ వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకొ నేను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంత కంతకూ పెరుగుతుండటం గమనార్హం.