బాబాయ్ బాలయ్యకు జోడిగా.. అబ్బాయి తారక్ హీరోయిన్?
కాగా ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. యంగ్ సెన్సేషన్ శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటించింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడూ మరో సినిమా కోసం సిద్ధమవుతున్నాడు బాలయ్య. బాబి దర్శకత్వంలో బాలయ్య 109 ప్రాజెక్టు తెరకెక్కిబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అయితే బాలయ్య సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలోను ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్యకు జోడిగా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ నటించబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష. ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్యకు హీరోయిన్గా నటిస్తుందట. అందం మాత్రమే కాదు నటనకు కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో దర్శకుడు ఈ పాత్రకు త్రిష అయితేనే సరిగా సరిపోతుందని ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పాత్ర చుట్టూ తిరిగే యాక్షన్ మోడ్ కూడా ఉంటుందని టాక్. అయితే బాలయ్యకు తొలిసారిగా త్రిష జోడిగా నటిస్తుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్కు జోడిగా దమ్ము సినిమాలో నటించింది త్రిష. కాగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుందట.