ఫస్ట్ వీక్ అన్ని కోట్లు రాబట్టిన బాలయ్య భగవంత్ కేసరి..!!

Divya
బాలయ్య కెరియర్ లోనే భగవంత్ కేసరి సినిమా ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావు పూడి బాలయ్య ను పాత్ర ను సరికొత్తగా చూపించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించక బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది. అయితే ఇందులో బాలయ్య శ్రీలీల పాత్రలకి మంచి పాపులారిటీ దక్కించుకోవడం గమనార్హం. భగవంత్ కేసరి సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే..

ఈ సినిమా మొదటి వీకెండ్ వరల్డ్ వైడ్ గా 36.8 కోట్ల రూపాయలను రాబట్టినట్లుగా తెలుస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే 65.4 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సమాచారం.బిజినెస్ విషయానికి వస్తే 68 కోట్ల రూపాయలు జరిగింది. అయితే ప్రాంతాలవారీగా రికవరీ విషయానికి వస్తే నైజాం ఏరియాలో 66%.. సీడెడ్ ప్రాంతంలో 50 శాతం.. ఆంధ్రాలో 46%.. ఓవర్సీస్ లో 94%.. మొత్తం మీద 54.2% వరకు రికవరీ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సగం వరకు పూర్తి అయినట్టుగా తెలుస్తోంది ఇంకా సగభాగం మిగిలి ఉన్నది కనుక అయితే ఈ చిత్రం నైజాం మరియు ఓవర్సీస్లలో భారీ కలెక్షన్లు సాధిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా బాలయ్య  సీనియర్ హీరోలకు రికార్డులను సైతం సృష్టిస్తూ.. యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు.. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరీ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంతో బాలయ్య అభిమానులకు ఆనందానికి అవధులు లేవు.. నెక్స్ట్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పొలిటికల్ అయిపోయిన ఇచ్చి ఉంటుందా లేకపోతే ముందుగానే మొదలు పెడతారు అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఈసారి దసరాకు బాలయ్యదే హవా అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: