ఆ సినిమాతో రవితేజ కం బ్యాక్ ఇవ్వనున్నాడా..?

frame ఆ సినిమాతో రవితేజ కం బ్యాక్ ఇవ్వనున్నాడా..?

Pulgam Srinivas
       మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర అనే సినిమాలో హీరోగా నటించాడు. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ సినిమా రవితేజ కు అపజయాన్ని మిగిల్చింది. ఇలా రావణాసుర మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ నటుడు తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించాడు.


వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్ లుగా నటించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ఈ రోజు అనగా అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ  , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కొన్ని చోట్ల ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లు కూడా ప్రదర్శించబడ్డాయి. అందులో భాగంగా ఈ మూవీ కి మంచి డీసెంట్ టాక్ లభిస్తుంది.


కాకపోతే ఈ సినిమా మూడు గంటల ఒక నిమిషం రన్ టైమ్  తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కారణంతో ఈ మూవీ కాస్త ల్యాగ్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి రావణాసుర మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ తో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే రవితేజ ఈ మూవీ లో బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: