
మర్రి రాజశేఖర్ కు లావు ఇచ్చిన హామీ ఏమిటి ..!
జగన్ వైఎస్ఆర్సిపి పెట్టిన వెంటనే ఆ పార్టీలు చేరి దాదాపు 10 ఏళ్ల పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు .. 2019 లో మర్రికి చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు ఇవ్వని జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్లో మంత్రిగా తన పక్కన కూర్చోబెట్టుకుంటానని బహిరంగంగా హామీ ఇచ్చి మరి విస్మరించారు .. మర్రి విడదల రజినీ కోసం తన సీటు త్యాగం చేశారు .. అదే రజనీకి మంత్రి పదవి ఇచ్చారు వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మర్రి ఆ పార్టీలో ఉన్నప్పుడు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గంగా ఉండేవారు ..
ఇక ఇప్పుడు మర్రిన్ని టిడిపిలోకి తీసుకువెళ్లే ఆలోచన కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదే .. ఇక మర్రి మరో ఐదేళ్లపాటు ఉన్న తన ఎమ్మెల్సీ పదవి వదులుకుని మరి టిడిపి కండువా కప్పుకుంటున్నారు .. ఈ క్రమంలో టిడిపిలో ఆయనకు తన ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయడం తో పాటు భవిష్యత్తులను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే సీటు ఇప్పించేలా లావు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు .. అయితే ఇది నియోజకవర్గాల పునర్ విభజన జరిగి ఎమ్మెల్యే సీట్లు పెరిగితేనే సాధ్యమవుతుంది