BBT 7: శివాజికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. విన్నర్ అయినట్లే?
గత కొంతకాలంగా చూసుకుంటే బుల్లితెరపైన బిగ్ బాస్ షో తన హవాని కొనసాగిసొంది. బేసిగా బుల్లితెరపైన ఎన్నో రకాల కాన్సెప్టులు, షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి అని చెప్పుకోక తప్పదు. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన బిగ్ బాస్ తెలుగులో ఎన్నో సీజన్లను పూర్తి విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా ఇప్పుడు ఏడో దానితో ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ షోలో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న శివాజికి బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది, ఆ తర్వాత 5 కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందరిలో అతి తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లు అనిపించుకొని ముందుకు సాగుతున్నారు. వారిలో సీనియర్ హీరో శివాజి ఒకరని అందరికీ తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే తనదైన ఆట తీరును, మైండ్ గేమ్‌ను ప్రదర్శిస్తున్నాడు. దీంతో ప్రేక్షకుల హృదయాలను ఇట్టే దోచుకుంటున్నాడు. ఇక ఈ ఏడో సీజన్‌లో టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న శివాజిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపుతున్నట్లు ఆదివారం రాత్రి ఎపిసోడ్ ముగిసిన తర్వాత ప్రోమోలో చూపించడం జరిగింది. దీంతో ఈ విషయం ఇపుడు ఇది పెద్ద సంచలనంగా మారింది.
చాలా మంది అతడిని మళ్లీ వెనక్కి తీసుకు వస్తారని చెబుతున్నా.. శివాజి అభిమానులు మాత్రం ఒకింత ఆందోళన చెందుతుననృ. సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ శివాజిని కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి చేయి ఎలా ఉందని అడిగాడు. దానికి శివాజీ ఇబ్బందిగానే ఉందని సమాధానం ఇచ్చాడు. దీంతో బిగ్ బాస్ మాట్లాడుతూ... 'శివాజి.. మీరు వైద్య పరీక్షల కోసం బయటకు రావాల్సి ఉంటుంది. స్కానింగ్ అయిన తర్వాత మళ్లీ లోపలికి పంపుతాము. ఈ విషయాన్ని అందరికీ చెప్పి రండి' అని ఆదేశించాడు. బిగ్ బాస్ సూచన మేరకు శివాజి హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి 'నేను వెళ్లొస్తాను' అంటూ మెయిన్ గేట్ వైపు వెళ్లాడు.