ఏంటి.. హీరోయిన్ శ్రీలీల.. అనిల్ రావుకుడికి కోడలు అవుతుందా?
ఇక ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో బాలయ్య కూతురు పాత్రలో నటించింది అన్న విషయం తెలిసిందే. ఇకఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. భగవంతు కేసరి అనే టైటిల్‌తో ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర బంధం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.
దీంతో ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎక్కడ చూసిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. హీరోయిన్ శ్రీలలకు తనకు మధ్య దగ్గర బంధుత్వం ఉంది అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఏకంగా శ్రీ లీల తనకు వరుసకు కోడలు అవుతుంది అంటూ చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. శ్రీ లీల స్వస్థలం పొంగులూరు తన అమ్మమ్మ గారి ఊరు అంటూ చెప్పిన అనిల్ రావిపూడి.. శ్రీ లీల అమ్మ నాకు అక్క వరుస అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం శ్రీలీలకు కూడా తెలుసు అని.. అందుకే షూటింగ్ సమయంలో మామయ్య అంటూ ఆటపట్టించేది అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.