లియో: డే 1 అన్ని కోట్ల వసూళ్లు ఖాయం?

Purushottham Vinay
తమిళ హీరో తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న భారీ బడ్జెట్ చిత్రం లియో. ఈ మూవీపై దేశ వ్యాప్తంగా కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.ఎందుకంటే వరుస విజయాల మీద ఉన్న లోకేష్, అలాగే ఈ మధ్య ఫెయిల్యూర్ లేకుండా మూవీస్ చేస్తోన్న దళపతి విజయ్ కాంబోలో సినిమా కావడంతో చాలా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అందుకే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి తమిళనాడు వెళ్తున్నారు. లోకేష్ ఈ మూవీపై చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఆల్రెడీ తన ఫ్రెండ్స్ కి సినిమా చూపించానని వాళ్లకి చాలా నచ్చిందని చెప్పాడు. ఇంకా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. బుక్ మై షో లో జవాన్ సినిమాకి ధీటుగా లియో రికార్డులు సృష్టిస్తుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా వస్తోంది. అలాగే మూవీలో సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ లాంటి సూపర్ స్టార్ క్యాస్టింగ్ ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష కనిపిస్తోంది.



ఇంతటి ఈ స్టార్ క్యాస్టింగ్ కూడా మూవీపైన అంచనాలు పెరగడానికి కారణం అని చెప్పొచ్చు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి కోలీవుడ్ లో హైయెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ రావడం పక్కా అట.ప్రస్తుతం ఓవర్సీస్, తో పాటు తమిళనాడులో జరుగుతోన్న బుకింగ్స్ చూస్తూ ఉంటే కచ్చితంగా మొదటి రోజు ఈ సినిమాకి వంద కోట్లు ఓపెనింగ్ కలెక్షన్స్ దాటిపోవడం పక్కా అంటున్నారు.ముఖ్యంగా తమిళనాడులో ఖచ్చితంగా 30 కోట్ల గ్రాస్ ఈ మూవీకి వస్తుందని అంచనా. ఇంకా అలాగే మిగిలిన సౌత్ రాష్ట్రాలలో ఒక్కో చోట 10 కోట్ల గ్రాస్ తగ్గకుండా ఓపెనింగ్ డే కలెక్షన్స్ రావొచ్చని టాక్. ఓవర్సీస్ లో కూడా లియో చాలా గట్టిగానే రాబడుతుందని భావిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 125 కోట్ల దాకా మొదటి రోజు లియో చిత్రానికి కలెక్షన్స్ గా రావొచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలా అయితే తమిళ సినిమా ఇండస్ట్రీలోనే ఇది హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ అవుతాయి.ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పెరగొచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: