స్కై బ్లూ కలర్ స్టైలిస్ట్ డ్రెస్లో అలరిస్తున్న కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యే చందమామ మూవీతో మంచి విజయాన్ని అందుకొని మగధీర మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ రేసులోకి వెళ్లిపోయిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మగధీర మూవీ తర్వాత వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.


 ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం.లోనే ఈ బ్యూటీ గౌతమ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని ఒక పండంటి మగ బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. ఇకపోతే పెళ్లి ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మను ఇచ్చే క్రమంలో కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మళ్ళీ వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ సినిమాలలో తన అందాలను ఏ స్థాయిలో అయితే ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అరబోస్తోంది.


 ఇకపోతే అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో చాలా క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా కాజల్ పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ స్కై బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో కాజల్ చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్ లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో కీలక పాత్రలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: