బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ మిషన్ రాణిగంజ్. ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆస్కార్ బరిలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసి నెటిజన్స్ షాక్ తిన్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయిన ఈ సినిమా ఆస్కార్ కి ఎంపిక అవ్వడం ఏంటి పరువు పొగడతారా అని కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 6న థియేటర్లో విడుదలైన మిషన్ రాణిగంజ్ చిత్రం ఓ బయోపిక్. ఇక స్టోరీ విషయానికి వస్తే రాణిగంజ్ కోల్‌ఫీల్డ్స్‌లో 65మంది మైనర్లను కాపాడిన జశ్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. అక్షయ్ కుమార్ ప్రాధాన పాత్రలో నటించిగా ఈ సినిమాలో ఆయనకు జోడిగా పరిణీతి చోప్రా నటించారు. అయితే విమర్షకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కమర్షల్‌గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
ఇక వచ్చే ఏడాది ఆస్కార్ రేసులో పోటీ పడేందుకు జనరల్ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా ఈ చిత్ర బృందం నామినేషన్ వేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న ఈ వార్తపై అక్షయ్ కుమార్ అభిమానులు మాత్రం సంతోషంగా ఉన్నారు.మరి చూడాలి అక్షయ్ కుమార్ లక్ ఎలా ఉంటుందో..గత ఏడాది ఆస్కార్ గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చిత్ర యూనిట్ కూడా ఇలానే ఇండిపెండెంట్‌గా కొన్ని కేటగిరీల్లో నామినేషన్ వేసింది. ఆ తరువాత సొంతంగా ప్రచారం చేసుకుని ఒరిజనల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు గాను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈసారి ఆస్కార్ 2024 అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడుతుండగా..జ్యూరీ మలయాళ మూవీ 2018ను ఎంపిక చేసిన విషయం అందరికి తెలిసిందే.